Karthika Pournami How To Perform Puja Know 2024
కార్తీక పౌర్ణమి పూజ ఎలా చేయాలో తెలుసుకోండి 2024
కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి అనగా మనకు వచ్చే హిందూ పండుగలో చాలా అంటే చాలా ముఖ్యమైనది అందుకోసమే మనం కార్తీక పౌర్ణమి రోజు హిందువులందరం నది స్నానం చేసి ఎక్కువ నది స్నానానికి ప్రాముఖ్యత చూపిస్తాం.
ఎందుకంటే నది స్నానం చేయడం వల్ల అనేక పాపాలు తొలగి పోతాయని హిందువులు నమ్ముతారు నదీ స్నానానికి వీలు కాకపోతే ఇంటి దగ్గరే నీటి తొట్టెలో అయినా స్నానం చేసి తమ పాపాలను
పోగొట్టడానికి ఎక్కువ ఆశక్తి చూపిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి దేవతలను సంతోష పెట్టడానికి ఒక ప్రధానమైన రోజు, ఈరోజు అనేకమంది తమకు తోచిన దానాలు ఇస్తారు. అలాగే దీపాల్ని కూడా దానం చేస్తారు ఇలా చేయడం,
వల్ల పుణ్యఫలం సిద్ధిస్తుందని వారు నమ్ముతారు. అనేకమంది హిందూ భక్తులు కార్తీక పౌర్ణమి నాడు కార్తీక వ్రతాలు కూడా చేస్తారు మీరు ఈ వ్రతాలను పౌర్ణమి గడియాల్లోనే ముగిసిన తర్వాత దేవుడికి పూజలు చేసి వదిలేస్తారు.
ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ఎలా పూజ చేయాలంటే
కార్తీక పౌర్ణమి రోజున చాలామంది భక్తులు ఎలా చేయాలని తర్జన భర్జన పడతారు. ఎటువంటి పూజలు చేస్తే దేవుడికి మనం చేసేది నచ్చుతుంది అనే విషయంలో చాలా ఆలోచనలు చేస్తారు
అయితే ఎవరికి తోచిన విధానం వాళ్ళు పూజలు చేస్తారు కానీ అసలు కార్తీక పౌర్ణమి పూజ గురించి పురాణాల్లో ఏముంది అనేది చూస్తే, కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి,
ఎటువంటి వారైనా ఎక్కువగా నది స్థానం చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తారు. ఆ తర్వాత నెయ్యితో దేవుడికి దీపం వెలిగించడం, వీలైతే ఉపవాసం ఉండడం కోసం ప్రయత్నిస్తారు.
ఉపవాసాలు చేయడం చాలా రోజులుగా ఆనవాయితీగా వస్తుంది ఇలా చేయడం చాలా శుభకరం.
Karthika Pournami How To Perform Puja Know 2024 ఈ కార్తీక పౌర్ణమి పర్వదినాన శివుడి పూజ గాని, సత్యనారాయణ స్వామి కథను వినడం గాని ఇలా చాలా మంచిది జరుగుతుందని మనమందరం విశ్వసిస్తాం కావున మీరు కూడా కార్తీక పౌర్ణమి
రోజు సత్యనారాయణ స్వామి కథను వినడానికి ప్రయత్నించండి మీకు సత్యనారాయణ స్వామి కథను వినడం వీలు కాకపోతే ఇంకేం చేయడం. కార్తీక పౌర్ణమి సాయంత్రం రోజున లక్ష్మీనారాయణకు
హారతి ఇవ్వడం చాలా మంచిది మీకు సకల సంతోషాలు కలుగజేస్తుంది ఎవరు అయినా ఈరోజు కేవలం గోమాత నెయ్యితో మాత్రమే దీపాన్ని పెట్టండి అంతేకాకుండా సాయంత్రం పూట తులసి కోటలో
నెయ్యితో దీపం వెలిగించడం మర్చిపోకండి ఇది చాలా శుభకరం ఇంకా తులసి దేవికి పూజ చేయడం వలన సంతోషాలు మీ నుంచి ఎవరు దూరం చేయకుండా ఉంటారు, కార్తీక పౌర్ణమి రోజు దానధర్మాలు
చేయడం చాలా మంచిది ఇలా మీరు కూడా ఎవరికైనా సరే ఆకలితో ఉన్నవారికైనా అన్నం పెట్టడం లాంటివి ఇంకా ఏమైనా దానాలు చేయడం లాంటివి, చేస్తే అలాంటివి చేయడం వల్ల పుణ్యఫలం సిద్ధిస్తుంది
ఆకలి అన్నవారికి పట్టడన్నం పెట్టి పుణ్యాన్ని మూట కట్టుకోండి. కార్తీక పౌర్ణమి రోజు దీపాలను మాత్రం వెలిగించడం మర్చిపోవద్దు.
Karthika Pournami How To Perform Puja Know 2024
కార్తీక పౌర్ణమినాడు ఈ పనులు అసలు చేయకండి:
కార్తీక పౌర్ణమినాడు ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు వారికి ఖాళీ చేతులతో అసలు పంపకండి అలాగే ముఖ్యంగా ఈరోజు పేదలు, వృద్ధులతో మరియు నిస్సహాయకులతో కఠినంగా కఠినమైన మాటలు అస్సలు మాట్లాడకండి ఇవి మానుకోండి.
కార్తీక పౌర్ణమి నాడు శాకాహారాన్ని అంటే సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి మరియు బ్రహ్మచర్యం కూడా కచ్చితంగా పాటించాలి.
కార్తీక పౌర్ణమి రోజున ఎవరిని కూడా అవమానించడం అసహ్యించుకోవద్దు ఇలా చేయడం వల్ల దేవతలకు కోపం వస్తుంది మరియు ప్రతికూలత వస్తుంది, అలా చేయడం మానుకోండి.
కార్తీక పౌర్ణమి నాడు దానాలు విరాళాలు ఇవ్వడానికి చాలా అనుకూలమైన రోజు అయితే ఈ రోజున వెండి పాత్రలు లేదా పాలు వంటి వస్తువులను దానం చేయడం మానుకోవాలి. ఇలా చేయడం వల్ల చంద్ర భాధలు అంటే
చంద్ర దోషం వస్తుంది మరియు దీని ద్వార ఆర్థిక సమస్యలకు దారి తీస్తది.
కార్తీక్ పౌర్ణమి రోజు పూజ ఎలా చేయాలంటే
Karthika Pournami How To Perform Puja Know 2024 కార్తీక పౌర్ణమి రోజే తులసి మాత భూమి మీదకు వచ్చిందని మనకు అనేక పురాణాల్లో చెప్పడంతో పాటు అనేకమంది భక్తులు కూడా నమ్ముతారు కావున తులసి మాతకు తప్పకుండా ఆవు నెయ్యితో కాని నువ్వుల నూనె తో దీపం వెలిగించి
పూజ చేయడం అనేది చాలా మంచిది తులసి మాతకు పూజ చేసేటప్పుడు గంగజలంని మాత్రం మరవద్దు. గంగజలంతో తులసిమాత కి అర్పించడం చాలా మంచిది ఈరోజు తులసిమాతను ఈరోజు విష్ణువుకి సమర్పించడం,
వలన మీకు అనేక భోగభాగ్యాలు కలుగుతాయి కావున తులసి మాత విష్ణు దేవుడికి అర్పించడం, అంతేకాకుండా మరో విషయం గుర్తు పెట్టుకోండి ఈరోజు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం అనేది.
అలాగే ఈరోజు ఒక నాణెం తీసుకొని దానికి పసుపు పూసి ఒక ఎర్రని వస్త్రంలో చుట్టి భద్రంగా ఉంచండి. ఇలా చేయడం చాలా మంచిదని అందరూ భావిస్తారు అట్లా ఇలా చేయడం వల్ల మన కుటుంబంలో ఎక్కువ
సిరిసంపదలు పెరిగి ఆరోగ్యంగా ఉంటారని అందరి నమ్మకం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ కార్తిక మాసాన్ని పవిత్ర మాసంగా పిలుస్తారు ఇక్కడ దీపావళి పండుగ రోజున మొదలై నెలాఖరి వరకు కొనసాగుతుంది.
ఈ సమయంలో ప్రతిరోజు దీపాలను వెలిగిస్తారు చివరి రోజు కార్తీక పౌర్ణమినాడు పౌర్ణమి రోజున ఇంట్లో 365 వత్తులతో నూనె దీపాలను తయారుచేసి వీటిని శివాలయంలో వెలిగించడం చాలా మంచిది.
ఇంకా ఈ కార్తీక పౌర్ణమి రోజు మన ఇంటిని అందంగా అలంకరించుకోవడం పూలతో అలాగే గుమ్మానికి మామిడాకుల తోరణం కట్టి బంతిపూలుతో అలంకరించడం వల్ల ఆ దేవుడి ఆ దేవుడి కృపకు పాత్రులు కండి ఇంక,
ఈరోజు నుంచి కార్తీక పౌర్ణమి గడియాలనేది ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఈ సంవత్సరం, కార్తీక పూర్ణిమ నవంబర్ 15, 2024 తేదీన కావున అందరూ కార్తీక పౌర్ణమి ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా జరుపుకోవాలని చాలా సంతోషంగా
గడపాలని కోరుకుంటున్నాను.