Sri Rama Ashtottara Sata Namaavali

Sri Rama Ashtottara Sata Namaavali

Sri Rama Ashtottara Sata Namaavali:

Sri Rama Ashtottara Sata Namaavali is a powerful prayer consisting of 108 names of Lord Rama. Chanting the Sri Rama Ashtottara Sata Namaavali helps devotees receive Lord Rama’s blessings for peace, protection, and prosperity. Each name represents a divine attribute of Lord Rama, making it a meaningful spiritual practice.

Reciting the Sri Rama Ashtottara Sata Namaavali regularly brings purity, spiritual growth, and fulfillment of desires. It is a simple yet effective way to connect with the divine energy of Lord Rama and overcome life’s obstacles.

శ్రీ రామ అష్టోత్తర శతనామావళి అనేది శ్రీ రాముని 108 పేర్లతో కూడిన మాలిక. ఇది హిందూ ధర్మంలో ఒక ముఖ్యమైన ప్రార్థన విధానం. ఈ నామావళి ద్వారా భక్తులు శ్రీ రాముని గుణాలు, శక్తిని స్మరించుకుని ఆయన ఆశీస్సులు పొందాలని కోరుకుంటారు. ప్రతి పేరు ఒక్కొక్కటి శ్రీ రాముని విభిన్న లక్షణాలను, స్వరూపాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది సాధారణంగా పూజలు, అభిషేకాలు లేదా నిత్య ప్రార్థనల్లో పఠించబడుతుంది. శ్రీ రామ అష్టోత్తర శతనామావళి పఠనంతో భక్తి, శాంతి, మరియు ఆరోగ్యం లభిస్తాయని విశ్వసించబడుతుంది.

శ్రీ రామాష్టోత్తర శత నామావళి

ఓం శ్రీరామాయ నమః
ఓం రామభద్రాయ నమః
ఓం రామచంద్రాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం రాజీవలోచనాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం రాజేంద్రాయ నమః
ఓం రఘుపుంగవాయ నమః
ఓం జానకీవల్లభాయ నమః
ఓం జైత్రాయ నమః ॥ 10 ॥

ఓం జితామిత్రాయ నమః
ఓం జనార్దనాయ నమః
ఓం విశ్వామిత్రప్రియాయ నమః
ఓం దాంతాయ నమః
ఓం శరణత్రాణతత్పరాయ నమః
ఓం వాలిప్రమథనాయ నమః
ఓం వాఙ్మినే నమః
ఓం సత్యవాచే నమః
ఓం సత్యవిక్రమాయ నమః
ఓం సత్యవ్రతాయ నమః ॥ 20 ॥

ఓం వ్రతధరాయ నమః
ఓం సదా హనుమదాశ్రితాయ నమః
ఓం కోసలేయాయ నమః
ఓం ఖరధ్వంసినే నమః
ఓం విరాధవధపండితాయ నమః
ఓం విభీషణపరిత్రాత్రే నమః
ఓం హరకోదండ ఖండనాయ నమః
ఓం సప్తసాల ప్రభేత్త్రే నమః
ఓం దశగ్రీవశిరోహరాయ నమః
ఓం జామదగ్న్యమహాదర్పదళనాయ నమః ॥ 30 ॥

ఓం తాటకాంతకాయ నమః
ఓం వేదాంత సారాయ నమః
ఓం వేదాత్మనే నమః
ఓం భవరోగస్య భేషజాయ నమః
ఓం దూషణత్రిశిరోహంత్రే నమః
ఓం త్రిమూర్తయే నమః
ఓం త్రిగుణాత్మకాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం త్రిలోకాత్మనే నమః
ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః ॥ 40 ॥

Manidweepa Varnanam Telugu
Manidweepa Varnanam Telugu

ఓం త్రిలోకరక్షకాయ నమః
ఓం ధన్వినే నమః
ఓం దండకారణ్యకర్తనాయ నమః
ఓం అహల్యాశాపశమనాయ నమః
ఓం పితృభక్తాయ నమః
ఓం వరప్రదాయ నమః
ఓం జితక్రోధాయ నమః
ఓం జితామిత్రాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం ఋక్షవానరసంఘాతినే నమః ॥ 50॥

ఓం చిత్రకూటసమాశ్రయాయ నమః
ఓం జయంతత్రాణ వరదాయ నమః
ఓం సుమిత్రాపుత్ర సేవితాయ నమః
ఓం సర్వదేవాదిదేవాయ నమః
ఓం మృతవానరజీవనాయ నమః
ఓం మాయామారీచహంత్రే నమః
ఓం మహాదేవాయ నమః
ఓం మహాభుజాయ నమః
ఓం సర్వదేవస్తుతాయ నమః
ఓం సౌమ్యాయ నమః ॥ 60 ॥

ఓం బ్రహ్మణ్యాయ నమః
ఓం మునిసంస్తుతాయ నమః
ఓం మహాయోగినే నమః
ఓం మహోదారాయ నమః
ఓం సుగ్రీవేప్సిత రాజ్యదాయ నమః
ఓం సర్వపుణ్యాధిక ఫలాయ నమః
ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః
ఓం ఆదిపురుషాయ నమః
ఓం పరమపురుషాయ నమః
ఓం మహాపురుషాయ నమః ॥ 70 ॥

ఓం పుణ్యోదయాయ నమః
ఓం దయాసారాయ నమః
ఓం పురాణాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం స్మితవక్త్రాయ నమః
ఓం మితభాషిణే నమః
ఓం పూర్వభాషిణే నమః
ఓం రాఘవాయ నమః
ఓం అనంతగుణగంభీరాయ నమః
ఓం ధీరోదాత్త గుణోత్తమాయ నమః ॥ 80 ॥

ఓం మాయామానుషచారిత్రాయ నమః
ఓం మహాదేవాది పూజితాయ నమః
ఓం సేతుకృతే నమః
ఓం జితవారాశయే నమః
ఓం సర్వతీర్థమయాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్యామాంగాయ నమః
ఓం సుందరాయ నమః
ఓం శూరాయ నమః
ఓం పీతవాససే నమః ॥ 90 ॥

ఓం ధనుర్ధరాయ నమః
ఓం సర్వయజ్ఞాధిపాయ నమః
ఓం యజ్వనే నమః
ఓం జరామరణవర్జితాయ నమః
ఓం శివలింగప్రతిష్ఠాత్రే నమః
ఓం సర్వావగుణవర్జితాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం పరస్మై బ్రహ్మణే నమః
ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః
ఓం పరస్మైజ్యోతిషే నమః ॥ 100 ॥

ఓం పరస్మై ధామ్నే నమః
ఓం పరాకాశాయ నమః
ఓం పరాత్పరాయ నమః
ఓం పరేశాయ నమః
ఓం పారగాయ నమః
ఓం పారాయ నమః
ఓం సర్వదేవాత్మకాయ నమః
ఓం పరాయ నమః ॥ 108 ॥

Sri Shirdi Sai Baba Chalisa In Telugu
Sri Shirdi Sai Baba Chalisa In Telugu

ఇతి శ్రీ రామాష్టోత్తర శతనామావళీస్సమాప్తా ॥

Sri Rama Ashtottara Sata Namaavali
పూజా విధానం మరియు మంచి సమయాలు:

పూజ చేయడానికి కొన్ని ముఖ్యమైన సమయాలు ఉన్నాయి దాంట్లో ఇవి శాస్త్ర ప్రకారం వెనుకటి కాలంలో పాటిచ్చినవి ఈ సమయాలు మరింత శుభాన్ని కలగచేస్తాయని భావిస్తారు పూజలు చేసే సమయాన్ని సేవతో ఎంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉదయ సమయం సూర్యోదయానికి ఒక గంట ముందు సమయం దీన్ని “బ్రహ్మ ముహూర్తం” అంటారు ఇది చాలా మంచి శుభ సమయం. ఇప్పుడు ఈ సమయంలో చేయడం ద్వారా మనశ్శాంతిగా ఉంటుంది.

అలాగే సాయంత్రం సూర్యాస్తమయం గంట తర్వాత కూడా పూజలు చేయడానికి మంచి సమయం ఈ సమయంలో శుభాకాంక్షలు మరియు క్షమాపణలు కోరడానికి చాలా మంచి సమయం.

దీనికి నక్షత్రాలు మరియు ముహూర్తాలు ప్రతి నెలలో కొన్ని ప్రత్యేకమైన ముహూర్తాలు ఉంటాయి పూజలు చేయడానికి specific గా ముహూర్తలను అనుసరించడం మంచి ఫలితాలను ఇస్తుందని అందరూ భావిస్తారు.

మరిన్ని చూడండి.

Leave a Comment